మారేడ్ పల్లి సిఐ నాగేశ్వరరావుని పోలీస్ శాఖ నుంచి తొలగింపు !

-

మారేడ్పల్లి మాజీ సిఐ నాగేశ్వరరావు పై వేటు పడింది. అతడిని సర్వీస్ నుంచి తొలగిస్తూ తెలంగాణ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వివాహిత పై హత్యాచారం, అపహరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగేశ్వరరావును వనస్థలిపురం పోలీసులు మూడు నెలల క్రితం అరెస్టు చేసి రిమాండ్ కి తరలించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని హైదరాబాద్ సిటీ సివి ఆనంద్ దృష్టికి వనస్థలిపురం పోలీసులు తీసుకెళ్లారు. దీంతో సిపి సివి ఆనంద్ వెంటనే నాగేశ్వరరావుని సస్పెండ్ చేశారు.

నాగేశ్వరరావు రెండున్నర నెలలకు పైగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకి సెప్టెంబర్ 28న షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆయన చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు నాగేశ్వరరావు పై నమోదైన కేసును తీవ్రంగా పరిగణించారు. నాగేశ్వరరావుని విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version