చిత్తూరు సంత పేటలో ఉన్న “అమ్మ ఒడి ” స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహన పై చిత్తూరు ఆర్డిఓ ఫైర్ అయ్యారు. అనాథల పేరిట చందాలు వసూలు చేస్తూ పబ్బం గడుపుతున్న ఆశ్రమాన్ని గుర్తించారు. శిధిలావస్థలో ఉన్న పాడుబడ్డ భవనం లో అనాథలను ఉంచి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు గుర్తించిన అధికారులు…. చర్యలకు సిద్దమయ్యారు. పలువురు ఇక్కడ అనుమానాస్పద మృతి చెందినట్లు ఆరోపణలపై విచారణ చేపట్టిన ఆర్డీవో రేణుక… పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
దాతలు ఇచ్చే వస్తువులను తన కుటుంబ సభ్యులకు ఇవ్వడం మార్కెట్ లో అమ్మడం లాంటి ఆరోపణలు ఉన్నాయి. సేవా కార్యక్రమాలను పబ్లిసిటీ గా చూపించి విదేశాల నుంచి పెద్ద మొత్తంలో చందాలు వసూలు చేసి సొంత అవసరాలకోసం ఉపయోగించుకున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆశ్రమ నిర్వాహకులు పై ఆర్డిఓ రేణుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆశ్రమంలో కనీస వసతులు లేకపోవడం పాడుబడ్డ భవనంలో నిర్వహించడం పై మండిపడ్డారు.