దీపావళికి బంగారం కొంటున్నారా..? అయితే వీటిని మరచిపోకండి..!

-

ఎప్పటి నుండో మనం దీపావళి పండుగను చేసుకుంటున్నాము. భారతదేశంలో జరుపుకునే పండుగలలో దీపావళి కూడా ఒకటి. అయితే చాలా మందికి దీని అర్ధం ఏమిటి అనేది తెలీదు. దీపావళి అంటే దీపముల వరస అని అర్ధం. అందుకే ఈ పేరు వచ్చింది.

ఇదిలా ఉంటే చాలా మంది దీపావళి నాడు బంగారం కొంటూ వుంటారు. దీపావళి నాడు బంగారం కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు చాలా ముఖ్యం. వీటిని చూసే బంగారం కొనండి. లేదంటే అనవసరంగా డబ్బులు వృధా అయిపోతాయి.

సర్టిఫైడ్ బంగారాన్ని మాత్రమే తీసుకోండి:

బంగారం కొనేటప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్‌మార్క్ ఉన్న సర్టిఫైడ్ గోల్డ్ ని మాత్రమే కొనండి. ఇలా కొంటె నాణ్యతకు హామీ ఇస్తారు.

బంగారం ధర చూడండి:

ఈరోజు గోల్డ్ ధర ఎంత ఉందో చూసుకోండి. ముందు.. 22 క్యారెట్లకు చెందిన ధర ఒకలా ఉంటుంది. 24 క్యారెట్ల ధర ఒకలా, 18 క్యారెట్ల ధర మరోలా ఉంటాయి చూసుకోండి.

రీసెల్లింగ్, బైబ్యాక్ పాలసీ అడగండి:

అలానే మీరు బంగారం కొనే అప్పడు రీసెల్లింగ్, బైబ్యాక్ పాలసీ గురించి తెలుసుకోండి.

ట్రస్టెడ్ షాప్స్ లో తీసుకోండి:

బంగారం కొనే అప్పడు పక్కాగా ట్రస్టెడ్ షాప్స్ లో తీసుకోండి. ఇది కూడా చాలా ముఖ్యం. బంగారం కొనే అప్పుడు రిసిప్ట్ ని కూడా తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version