ఈ వారమే స్ట్రీమింగ్ కానున్న ‘బిచ్చగాడు 2’

-

బిచ్చగాడు సినిమా సంచలనం సృష్టించారు విజయ్‌ అంటోని. అయితే.. విజయ్ ఆంటోని హీరోగా .. ఆయన దర్శక నిర్మాణంలో ‘బిచ్చగాడు 2’ సినిమా రూపొందింది. మే 19వ తేదీన ఈ సినిమా తమిళంతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేశారు. విడుదల చేసిన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. భారీ వసూళ్లను రాబట్టుకుంది. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా లాభాల బాటపట్టడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. కథాకథనాల పరంగా .. టేకింగ్ పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా విజయ్ ఆంటోని మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అన్నా చెల్లెళ్ల ఎమోషన్స్ బలంగా ఉండటం వలన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావ్య థాపర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, దేవ్ గిల్ .. జాన్ విజయ్ … రాధారవి .. మన్సూర్ అలీ ఖాన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version