నేటి కాలం లో చాలా మంది అనారోగ్య సమస్యల తో సతమతమవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది తీవ్రమైన సమస్యల తో బాధ పడుతున్నారు. ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తరిమికొట్టొచ్చు.
ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్టయితే… ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని చదవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. మహా మృత్యుంజయ మంత్రం విశిష్టత, ఎలా పాటించాలి, ఏ ప్రయోజనాలు పొందొచ్చు వంటివి నేడు మనం తెలుసుకుంది.
మహా మృత్యుంజయ మంత్రం విశిష్టత:
మహా మృత్యుంజయ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని చదవడం వల్ల ముందుగా చనిపోతామేము అన్న భయం పోతుంది. అదే విధంగా ఎంత ప్రమాదకరమైన జబ్బు నుంచి అయినా బయట పడడానికి వీలవుతుంది.
ఈ మంత్రాన్ని చదడం వల్ల సమస్యలు రావు. ఇటువంటి పరిస్థితుల్లో సురక్షితంగా ఉండడానికి మృత్యుంజయ మంత్రం చదువుకుంటే మంచిది. ప్రతి రోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే 108 సార్లు రుద్రాక్ష జపం చేస్తూ ఈ మంత్రాన్ని చదువుకోవడం మంచిది.
అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. అదే విధంగా ముందు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. మానసికంగా ఆరోగ్యం బాగుంటుంది. శివుడికి ఇష్టమైన సోమవారం నాడు చదువుకుంటే మరీ మంచిది.