త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను పార్లమెంట్ ఎన్నికల ముందు అమల్లోకి తేవడం చర్చనీయాంశంగా మారింది.ఇక కేంద్రం అమల్లోకి తెచ్చిన CAAను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని మత విభజన చట్టంగా అభివర్ణించిన పినరయి విజయన్… తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తేల్చి చెప్పారు. మరోవైపు ‘దేశంలో నేటి నుంచి CAAను అమల్లోకి తేవడాన్ని స్వాగతిస్తున్నాం అని ,కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం’ అని అయోధ్య రామమందిర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు.
ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం రాజకుంది.1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ ప్రభుత్వం సవరణలు చేసి 2019లో చట్టంగా మార్చింది. అయితే పౌరసత్వం ఇచ్చేందుకు మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి.