కేంద్రం సంచలనం…. సివిల్ సర్వీసెస్ ప్రక్షాళన దిశగా అడుగులు?

-

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. బీజేపీ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా భేటీ అయిన కేంద్ర కేబినేట్ సివిల్ సర్వీసెస్ ప్రక్షాళనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. దేశంలోని యువతలో చాలామంది సివిల్ సర్వీసెస్ సాధించాలని కలలు కంటూ ఉంటారు.

కేంద్రం సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యే వారు మరింత సృజనతో, ప్రతిభతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేలా ఉండే వాళ్లే ఎంపిక కావాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కేంద్రం మిషన్ కర్మ యోగిని ప్రారంభించనుంది. దీంతో పాటు కేంద్రం మన దేశ సంస్కృతి, విధానాలను మెరుగుపరిచే దిశగా ముందడుగులు వేస్తోంది. ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ సమావేశల్లో దేశ సంస్కృతి, విధానాలకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది.

ప్రకాశ్ జవదేకర్ కేంద్ర కేబినెట్ ఇంగ్లీష్, ఉర్దూ, కశ్మీరీ, హిందీ భాషలను జమ్మూ కశ్మీర్ లో అధికార భాషలుగా గుర్తించే బిల్లులకు సైతం ఆమోదం తెలిపింది. ఈ భాషలను అధికార భాషలుగా గుర్తించే బిల్లుకు ఆమోదం తెలపడం అతిపెద్ద మానవ వనరుల అభివృద్ధి సంస్కరణ ప్రకాశ్ జవదేకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం సివిల్ సర్వీసెస్ ప్రక్షాళన కోసం పీఎం అధ్యక్షతన హెచ్.ఆర్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది. ఇందులో ఎంపిక చేసిన కేంద్ర మంత్రులు, ముఖ్య మంత్రులు ఉంటారు. విద్యావేత్తలు, ప్రముఖుల ఆలోచనలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం సివిల్ సర్వీసెస్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news