సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.. ఇందులో భాగంగా..50 శాతానికి మించి ఉన్న బీసీ కులాలకు 71 ఎకరాల్లో 68 కోట్లతో భవనాల నిర్మాణం, ఆశావర్కర్ల వేతం రూ.7500కి పెంపు, కాంట్రాక్టు డాక్టర్ల వేతం రూ. 40వేల కి పెంపు, గోపాల మిత్రల వేతనం రూ.8500, వైద్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచారు. వీటితో పాటు అర్చకుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్ల కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ మరిన్ని వరాలను కురింపచనున్నట్లు మంత్రులు తెలిపారు త్వరలోనే మరో సారి క్యాబినెట్ భేటీ కానున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెళ్లడించారు.