రైతు భరోసా విధివిధానాల రూపకల్పన కోసం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. రైతు భరోసా అమలు చేసేందుకు విధివిధానాలు రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఇప్పటికే ప్రతిపక్షాలు సహా పలువురు నిపుణులు, రైతుల సలహాలు స్వీకరించిన కమిటీ.. ఆదివారం మరోసారి భేటీ అయ్యింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , శ్రీధర్ బాబు హాజరయ్యారు.
విధివిధానాల నిర్ణయంపై ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. సమావేశంలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై, పాటించాల్సిన నియమనిబంధనలపై చర్చ జరిగింది. ముఖ్యంగా టాక్స్ పేయర్లను, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసాకు అనర్హులుగా ప్రకటించాలనే సూచన ప్రాయ నిర్ణయం చర్చ జరిగింది. రైతు భరోసా అమలు విధివిధానాలపై కమిటీ పూర్తిగా నిర్ణయానికి రానట్లు తెలిసింది. ఇక రైతు భరోసాపై మరోసారి సమావేశం కావాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.