రజాకార్ నిర్మాతకు బెదిరింపు కాల్స్..!

-

రజాకర్ సినిమా విడుదలకి ముందే ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అసెంబ్లీ ఎన్నికలకి ముందే విడుదలకు సిద్ధమైన కొన్ని కారణాల వలన సినిమా విడుదల కాలేదు తాజాగా పార్లమెంట్ ఎన్నికల ఈ సినిమాని విడుదల చేశారు. ప్రస్తుతము థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో చిత్ర బృందానికి అనూహ్య పరిణామం ఎదురైంది చిత్ర నిర్మంత గూడూరు నారాయణరెడ్డి కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ప్రస్తుతం ఇది కలకలం రేపుతోంది.

రజాకర్ మూవీ ప్రదర్శన చేస్తున్నందుకు గూడూరు నారాయణరెడ్డి కి దాదాపు 1100 బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయనకి సెక్యూరిటీ ని కేటాయించింది. నిజాం రాక్షస పాలనికి వ్యతిరేకంగా నాడు ప్రజలు చేసిన పోరాటాన్ని గూడూరు నారాయణరెడ్డి సినిమాగా రూపొందించారు. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ అనసూయ కీలకపాత్ర పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news