అమెరికా దేశానికి కొద్ది రోజుల పాటు ఉప అధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్షురాలిగా బాధ్యత లు చేపడుతుంది. ఇప్పటి వరకు అమెరికా దేశానికి అధ్యక్షుని గా ఉన్న జో బైడెన్ కు అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సమయంలో ఉప అధ్యక్షురాలు కమలా హారీస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెద్ద పేగు భాగంలో చిన్న సమస్య ఉంది. ఈ పెద్ద పేగు సమస్య ప్రతి ఏడాది కొలనోస్కాపీ పరీక్ష నిర్వహిస్తారు.
అయితే ఈ కొలనోస్కాపి చేస్తున్న సమయంలో జో బైడన్ కు మత్తు మందు ఇస్తారు. కాబట్టి అమెరికా విషయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. దీని వల్లే అధ్యక్ష బాధ్యతలు కమలా హారిస్ కు అప్పగిస్తున్నారు. అయితే జై బైడన్ కు ఈ కొలనోస్కాపి పరీక్ష ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. కానీ బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఈ కొలనోస్కాపి చేయడం ఇదే మొదటి సారి. అయితే ఈ సమయంలో పూర్తి స్థాయిలో అధ్యక్షురాలుగా కమల హారీస్ ఉంటుంది. యూఎస్ ఆర్మీ పై, న్యూక్లియర్ ఆయుధాల పై కూడా కమలా హారిస్ నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది.