ఇండియన్, హెచ్‌పీ, భారత్‌ గ్యాస్‌ వాడే వారికి శుభవార్త! వాట్సాప్ ద్వారా గ్యాస్ ఇలా బుక్ చేసుకోవ‌చ్చు

-

మీరు గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే! దీంతో మీరు ఇకపై క్షణాల్లో గ్యాస్‌ బుక్‌ చేసుకునే సౌలభ్యం పొందుతారు. అదే వాట్సాప్‌ ద్వారా ఒక్క ఎస్‌ఎంఎస్‌ పంపి గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఇండియన్‌ గ్యాస్, హెచ్‌పీ, భారత్‌ ఏ ఎల్‌పీజీ సిలిండర్‌ వినియోగదారులకు ఊరట కలిగించే వార్త ఇది. గ్యాస్‌ సిలిండ్‌ బుకింగ్‌ కోసం సాధారణంగా మనం ఐవీఎఫ్‌ఆర్‌ బుకింగ్‌ చేసుకుంటాం. వాటి కోసం కొంత సమయం పాటు లైన్లో వేచి ఉండాలి. అదే విధంగా బుకింగ్‌కు కావాల్సిన నియమాలను పాటిస్తూ ప్రీ రికార్డెడ్‌ వాయిస్‌ ద్వారా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనం కొంత సమయం వృథా చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక పై సమయం ఆదా చేసేందుకు సులభంగా గ్యాస్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాయి ఆయిల్‌ కంపెనీలు.


ఇకపై ఎల్‌పీజీ సిలిండర్‌ను వాట్సాప్‌ ద్వారా సులభంగా సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు వాటి వినియోగదారులకు ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి.
వాట్సాప్‌ ద్వారా సిలిండర్‌ బుక్‌ చేయాలని అనుకునే వారు వారి గ్యాస్‌ కంపెనీ నంబర్‌ను మొబైల్‌ ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలి.

  • ఒకవేళ మీరు ఇండియన్‌ గ్యాస్‌ వినియోగదారులైతే ఫోన్‌ నంబర్‌– 7588888824 నంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి. వాట్సాప్‌ నుంచి రీఫిల్‌ అని మెసేజ్‌ పంపిస్తే సిలిండర్‌ బుక్‌ అయిపోతుంది.
    లేదంటే 7718955555 నంబర్‌కు కాల్‌ చేసి సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చు.
  • అదే మీరు భారత్‌ గ్యాస్‌ ఉపయోగిస్తున్నట్లు ఆ సంస్థకు చెందిన 1800224344 ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌ నుంచి బుక్‌ లేదా 1 అని మెసేజ్‌ పెట్టి సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చు.
  • ఒకవేళ మీరు హెచ్‌పీ సిలిండర్‌ వినియోదారులు అయితే 9222201122 నెంబర్‌ ద్వారా సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. వాట్సాప్‌ నుంచి మెసేజ్‌ పంపితే సిలిండర్‌ బుక్‌ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version