వాటే ఆఫర్: చౌక ధరకే ఇల్లు, ప్రాపర్టీ సొంత చేసుకోవచ్చు..!

చాలా మందికి సొంతిల్లు నిర్మించుకోవడం కల. మీకు కూడా సొంత ఇల్లు కావాలని అనుకుంటున్నారా..? లేదా ఇల్లు వుంది ఏదైనా ప్రాపర్టీ కొనే ప్రయత్నం లో వున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

బ్యాంక్ అదిరి పోయే ఆఫర్ ఒకటి అందుబాటు లోకి తీసుకు వచ్చింది. దీనితో ఇల్లు కొనుగోలు చెయ్యాలన్న లేదా ఏమైనా ప్రాపర్టీ కావాలన్నా ఎంతో చౌకగా మీ సొంతం చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇ-వేలం నిర్వహిస్తోంది. వేలంలో ఇల్లు, ప్లాట్స్, ఫ్లాట్స్, వేర్‌హౌస్, ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీస్ వంటివి కొనుగోలు చెయ్యచ్చు.

ఈ ఆక్షన్ ని వినియోగించుకుని ఈజీగా మంచి ఇళ్ళని, ప్రాపర్టీస్ ని కొనుక్కోండి. బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ 11న బ్యాంక్ ఇ-వేలం నిర్వహిస్తుంది.

www.iob.in వెబ్‌సైట్‌లో ప్రాపర్టీస్ అవైలబుల్ ఫర్ సేల్ అనే ఆప్షన్‌లో బ్యాంక్ ప్రాపర్టీ వివరాలను అందుబాటులో వున్నాయి. దీని ద్వారా మీరు పూర్తి వివరాలని అన్ని కూడా బ్యాంక్ ఇచ్చిన వెబ్ సైట్ లో చూసి తెలుసుకోవచ్చు.