ఆధార్ తో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. నెట్ లేకుండానే..!

-

ఆధార్ అన్నింటికీ ఎంతో అవసరం. ఆధార్ లేకపోతే చాలా పనులు జరగవు. స్కీమ్స్ మొదలు అకౌంట్ ఓపెన్ దాకా ఇది చాలా అవసరం. ఆధార్ కార్డులో మీ పేరు మొదలైన వివరాలతో పాటుగా ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్‌ వంటి బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కూడా లింక్ అయ్యి ఉంటుంది.

ఇక ఇది ఇలా ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఆధార్ తో చెక్ చేసుకోవచ్చట. మరి అదెలానో చూద్దాం.అకౌంట్లో బ్యాలెన్స్ చూసేందుకు బ్యాంకుకి లేదా ఏటీఎం వద్దకు వెళ్ళక్కర్లేదు. పైగా స్మార్ట్‌ఫోన్ ని వాడని వారు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ ద్వారా అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకోచ్చు. ఇంటర్నెట్ కూడా అక్కర్లేదు.

దీని కోసం ముందు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి *99*99*1# కి డయల్ చేయాలి.
నెక్స్ట్ మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌ను నమోదు చేయాలి.
రీవెరిఫై చేసేందుకు మళ్ళీ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
యూఐడీఏఐ మీ ఫోన్‌కు ఒక ఫ్లాష్ ఎస్ఎంఎస్‌ను పంపుతుంది.
దానిలో మీ బ్యాలెన్స్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఇలా ఈజీగా మనం అకౌంట్ బ్యాలెన్స్ చూడచ్చు.

బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడమే కాక ప్రభుత్వ సబ్సిడీకి దరఖాస్తు చెయ్యడం, అమౌంట్ సెండ్ చెయ్యడానికి కూడా ఆధార్ కార్డు వాడచ్చు. అయితే ఫోన్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ తప్పక చెయ్యాలి.

Read more RELATED
Recommended to you

Latest news