స్మార్ట్‌ఫోన్‌తో కంటి సమస్యలకు చెక్‌‌

-

స్మార్ట్‌ఫోన్‌తో కంటి సమస్యలకు చెక్‌ పట్టవచ్చు. తీవ్ర కంటి సమస్యలకు కారణమయ్యే ఫోన్ల ద్వారానే మన కంటి సమస్యలకు చెక్‌పెట్టవచ్చని చెబుతోంది. దానికి సంబంధిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్లు లేనిది ఏ పని కాదు. ఏ విషయం కోసం మనకు వివరాలు కావాలన్న మనం స్మార్ట్‌ఫోన్లోనే వెతుకుతాం. ఒకవిధంగా చెప్పాలంటే అరచెతిలోనే ప్రపంచం ఉంటుంది. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారు. దీనివల్ల చిన్న వయస్సులోనే వారిలో కంటి సమస్యలు అధికమయ్యాయి. కానీ, ఈ కంటి సమస్యలకు కూడా స్మార్ట్‌ఫోన్‌తోనే చెక్‌ పెట్టవచ్చు. తాజా అధ్యయనంతో స్మార్ట్‌ఫోన్‌ కళ్లను స్కాన్‌ చేయడం వల్ల కంటి సమస్యలకు అధిగమించవచ్చు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌ యూనివర్సిటీ ఈ విషయాన్ని తెలియజేసింది. దీనివల్ల తీవ్ర కంటి సమస్యలను అంధత్వాన్ని నివారించవచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్లకోమా వ్యాధితో బాధపడుతున్నారు.


గ్లకోమా వ్యాధి

వృద్ధుల్లో ఐఓఎస్‌ ఫలితాలు ప్రారంభంలో రోగ నిర్ధారణ చికిత్సకు ఉపయోగపడతాయని అధ్యయనవేత్తలు తెలిపారు. బర్మింగ్‌ హమ్‌ యూనివర్శిటీ అడ్వాన్స్‌డ్‌ మానుఫ్యాక్చరింగ్‌ డైరెక్టర్‌ ఖమీస్‌ ఎస్సా మాట్లాడుతూ.. కంటికి సౌండ్‌వేవ్‌లతో పరస్పర చర్యను ఎలా ప్రభావితం చేస్తాయి? స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఐఓఎస్‌ని కచ్చితంగా ఎలా కొలవాలి అనే విషయాలపై మేం అధ్యయనం చేశామని పరిశోధకులు తెలిపారు.

ప్రమాద కారకాలు

స్మార్ట్‌ఫోన్‌తో ఇతర కంటి వ్యాధుల కారకాలను సులభంగా అంచనా వేయచ్చని అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు డయాబెటీస్‌ రెటినోపతి విషయంలో కంటి రక్తనాళాల్లో అభివృద్ధి చెందుతున్న చిన్న క్లాట్లను స్మార్ట్‌ఫోన్‌ సాయంతో నిరంతరం పర్యవేక్షించవచ్చని యూనివర్శిటీ డైరెక్టర్‌ తెలిపారు. కానీ, ఈ అధ్యయనం ఫలితాలు ఇంజినీరింగ్‌ రిపోర్ట్‌ జర్నల్‌లో ప్రచూరితమైంది. గ్లకోమా వ్యాధి కంటి నుంచి కారుతున్న ద్రవాల అసమతుల్యత వల్ల సంభవిస్తుంది. ఈ వ్యాధి వృద్ధుల్లో సాధారణం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version