రూ.100తో ప్రతి నెలా రూ.19 వేలు పొందొచ్చు… ఎలా అంటే…?

-

మీరు ప్రతీ నెల మంచిగా డబ్బులు పొందాలని అనుకుంటున్నారా…? అయితే మీకు తప్పక దీని కోసం తెలియాలి. రూ.100తో ప్రతి నెలా రూ.19 వేలు పొందొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఈ స్కీమ్‌ లో కనుక చేరితే ప్రతి నెలా డబ్బులు వస్తాయి. అయితే మీరు నెలకు రూ.3 వేలు కట్టాలి.

ఈ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే చాల రకాల స్కీమ్స్ అందుబాటులో వున్నాయి కదా… వాటిలో ఇది కూడా ఒకటి. ఈ స్కీమ్ లో చేరితే ఒకేసారి భారీ మొత్తం తో పాటు ప్రతి నెలా పెన్షన్ కూడా పొందొచ్చు. అందుకే చాలా మంది ఈ పథకంలో చేరుతూ ఉంటారు. ఎన్‌పీఎస్ స్కీమ్‌తో పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు.

ఈ ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారు మెచ్యూరిటీ సమయంలో అరవై ఏళ్ళు వచ్చాక అరవై శాతం డబ్బును ఒకేసారి పొందొచ్చచు. అలానే మిగతా 40 శాతం మొత్తం తో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. దీని ద్వారా ప్రతి నెలా చేతికి పెన్షన్ వస్తుంది. 25 ఏళ్ల వయసు లో ఉన్న ఒక వ్యక్తి రోజుకు రూ.100 ఆదా చేస్తే అంటే నెలకు రూ.3 వేలు ఎన్‌పీఎస్‌లో పెడితే.. నెలకు రూ.19 వేల పెన్షన్ తీసుకోవచ్చు.

ఇలా ఇన్వెస్ట్ చేస్తూ రావాలి. 60 ఏళ్లలో ఈయనకు రూ.1.15 కోట్లు వస్తాయి. 10 శాతం రాబడిని పరిగణలోకి తీసుకున్నాం. 60 శాతం మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అంటే రూ.69 లక్షలు ఒకేసారి చేతికి వస్తాయి. మిగతా 40 శాతం అంటే రూ.45 లక్షలతో ఒక యాన్యుటీ ప్లాన్ కొనాలి. ఇక మనం ఐదు శాతం రాబడి కింద లెక్కిస్తే నెలకు రూ.19,200 వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version