వారికి గుడ్ న్యూస్..ఒక్క ఫోన్ కాల్‌తో 30 కి పైగా సేవలు…!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని ఇస్తోంది. వీటి వలన చాలా మంది కి ఉపయోగకరంగా ఉంటోంది. అయితే బ్యాంకింగ్ సేవలు లో స్టేట్ బ్యాంక్ మార్పులు చేసింది. మాములుగా ఖాతాదారులు తప్పని సరిగా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇక ఈ సేవలని పొందేందుకు వెళ్ళక్కర్లేదు. ఇంట్లో నుంచే బ్యాంకింగ్ సేవలు ని పొందొచ్చు.

స్మార్ట్‌ఫోన్ కూడా అక్కర్లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్‌గ్రేడ్ చేసిన కాంటాక్ట్ సెంటర్‌తో 30 పైగా బ్యాంకింగ్ సేవల్ని ఒకే కాల్ ద్వారా పొందేందుకు అవుతుంది. ఇక ఈ సేవలకు సంబంధించి వివరాలను చూద్దాం. 24 గంటల పాటు ఈ సేవలు ని మనం పొందొచ్చు. రెండు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా స్టేట్ బ్యాంక్ ఇచ్చింది. 1800-1234 లేదా 1800-2100 నెంబర్లకు కాల్ చేసి కస్టమర్లు బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. అయితే అప్‌గ్రేడ్ చేసిన కాంటాక్ట్ సెంటర్‌తో 30 పైగా బ్యాంకింగ్ సేవల్ని కేవలం మీరు సింగల్ నెంబర్ కి డయల్ చేసి పొందొచ్చు.

ఎలాంటి సేవలని పొందొచ్చు..?

బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డ్, చెక్ బుక్ వంటివి పొందొచ్చు.
అలానే ఎమర్జెన్సీ సర్వీసెస్, డిజిటల్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన సమాచారం ని కూడా పొందేందుకు అవుతుంది.
ఇలా ఎన్నో సేవలను టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి పొందొచ్చు.
గత 5 లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ ని తెలుసుకోవచ్చు.
ఏటీఎం కార్డ్ ని కూడా సులువుగా బ్లాక్ చేయొచ్చు.
ఈ సేవల ద్వారా కొత్త కార్డుకు రిక్వెస్ట్ చేయొచ్చు.
చెక్ బుక్ డిస్పాచ్ స్టేటస్ వంటి సమాచారం ని కూడా పొందవచ్చు.
అంతే కాక టీడీఎస్ వివరాలు, డిపాజిట్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ కి సంబంధించి వివరాలను తెలుసుకోవచ్చు.
ఇలా కాంటాక్ట్ సెంటర్ ద్వారా 30 కి పైగా సర్వీసెస్ ని పొందేందుకు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version