మార్చి 31లోపు ఈ స్కీమ్‌లో చేరితే.. పది వేలు పెన్షన్..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది తమకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే చక్కగా లాభాలు వస్తాయి. మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా…? కచ్చితంగా పెన్షన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండ మీరు దీని కోసం తెలుసుకోవాలి. పైగా ఇందులో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అదే ప్రధాన్ మంత్రి వయ వందన యోజన.

కచ్చితమైన పెన్షన్ ఈ స్కీమ్ తో పొందొచ్చు. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఈ స్కీమ్ కి సంబంధించి బాధ్యత తీసుకుంటోంది. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. అంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల వరకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది.

ప్రస్తుతం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పథకంపై 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో 2023 మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ వడ్డీ మార్చి 31 తర్వాత మారే అవకాశం వుంది. అందుకే ముందుగానే చేరితే 7.4 శాతం వడ్డీని పొందొచ్చు. ఈ స్కీమ్ లో సీనియర్ సిటిజన్స్‌ మాత్రమే చేరాలి. ఇందులో చేరితే ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల చొప్పున పెన్షన్ పొందొచ్చు.

ఒకవేళ మీరు నెలవారీని ఎంచుకుంటే 7.4 శాతం వడ్డీ వర్తిస్తుంది. అదే మూడు నెలలు అయితే 7.45 శాతం, ఆరు నెలలు అయితే 7.52 శాతం వస్తుంది. ఏడాది అయితే 7.66 శాతం చొప్పున వడ్డీ రేటు లభిస్తుంది. 60 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు పెట్టచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.9250 పెన్షన్ వస్తుంది.

ఈ స్కీమ్ లో భార్యాభర్తలు ఇద్దరూ డబ్బులు పెడితే రూ.18 వేలకు పైగా పొందొచ్చు. అయితే రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేసినవారు మరణిస్తే ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని నామినీకి ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version