‘పీకే’ను నమ్ముకుంటున్న కాంగ్రెస్… ఆ రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశం

-

దేశంలో ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీకి ఓడిపోవడం అలవాటుగా మారుతోంది. సరైన వ్యూహాలు లేక చతికిలపడుతోంది. క్యాడర్ ఉన్నా దాన్ని ఓట్లుగా, సీట్లుగా మార్చుకోలేకపోతోంది. ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా పరాజయం పాలైంది. ఇప్పటికే పార్టీలో ప్రక్షాళన కార్యక్రమాలు మొదలయ్యాయి. త్వరలోనే పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలు కూడా జరుగనున్నాయి. 

ఇదిలా ఉంటే వచ్చే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంసిద్ధం అవుతుంది కాంగ్రెస్. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీ నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీతో పీకే చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం పీకే ట్రాక్ రికార్డ్ బాగాలేదు. ఇటీవల గోవా ఎన్నికల్లో టీఎంసీ తరుపున పనిచేసినా… అక్కడ మమతా బెనర్జీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇదిలా ఉంటే 2017 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తో కలిసి కాంగ్రెస్ యూపీ ఎన్నికల కోసం పనిచేస్తే… అక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇక బీజేపీ అత్యంత బలంగా ఉన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని పీకే ఏవిధంగా అధికారంలోకి తీసుకువస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version