ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురి అరెస్టు!

-

భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వీరంతా భారత సంతతికి చెందిన వారే కావడం గమనార్హం.  కరణ్‌ ప్రీత్‌ సింగ్‌, కమల్‌ ప్రీత్‌ సింగ్‌, కరణ్‌ బ్రార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు కెనడా పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు అనుమానితులు ఎడ్మోంటన్‌లోని అల్బెర్టాలో ఉంటున్నారని.. వారిని అక్కడే అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. వీరు 3 నుంచి  5 ఏళ్ల నుంచి కెనడాలో ఉంటున్నారని వెల్లడించారు.

2023 జూన్‌లో సర్రేలో నిజ్జర్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. జూన్ 18న కెనడా బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్సు సర్రే పట్టణంలో ఉ‍న్న గురునానక్ సిక్‌ గురుద్వారా సాహిబ్‌ ఆవరణలో నిజ్జర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌కు సంబంధించిన ఏజెంట్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయగా..  వాటిని భారత్‌ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ట్రూడో  ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news