ఎన్నో ఏళ్ళ నుండి చూస్తున్నా పెళ్లి అవ్వట్లేదా..? ఇలా చేస్తే వెంటనే పెళ్లి కుదిరిపోతుంది..!

-

ఎంతోమంది పెళ్లిళ్లు అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా కాలం నుండి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నా మీకు పెళ్లి సంబంధం కుదరడం లేదా… అయితే కచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాల్సిందే. కొంతమంది పెళ్లిళ్లు అవ్వక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఇలా చేస్తే కచ్చితంగా పెళ్లి నిశ్చయమవుతుంది. ఇడగుంజి లేదా ఇడన్ గుంజి కి చాలా మంది వెళ్తూ వుంటారు. రెండు చేతుల గణపతి ఇక్కడుంటారు. ఒక చేతిలో పద్మం ఇంకో చేతిలో లడ్డూ ని కలిగి వుంటారు ఈయన.

ప్రతీ ఏడాది కూడా సుమారు పది లక్షల మంది భక్తులు ఇక్కడకి వెళ్తుంటారు. పశ్చిమ తీరంలో ఆరు వినాయకుడి ఆలయాల‌లో ఇది కూడా ఒకటి. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను పెడితే కోరికలన్నీ కూడా తీరిపోతాయి. కర్నాటక లోని బంధి అనే జాతి వారు పెళ్లి సంబంధాన్ని ఫిక్స్ చేసుకోవాలనుకుంటే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబాల వారు ఈ ఆలయానికి వెళ్తారు.

అక్కడ వినాయకుని రెండు పాదాల దగ్గర కూడా రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే అది శుభం. అదే ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ పడితే అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని చూసుకుంటారు. అలానే ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుంటే పెళ్లి అవుతుందట. ప్రముఖ శైవ క్షేత్రమైన గోకర్ణానికి దగ్గరలో ఈ గ్రామం ఉంది. శరావతి నది ఇడగుంజికి దగ్గర ఉన్న హోన్నవర్‌ వద్దనే అరేబియా సముద్రంలో కలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version