రాజధాని రాజకీయం అటూ-ఇటూ అయితే విశాఖ పరిస్థితి ఇదేనా

-

విశాఖ రియల్ ఎస్టేట్ కు రాజకీయ గ్రహణం పట్టింది. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో దూకుడు మీద వున్న స్తిరాస్ధి వ్యాపారానికి బ్రేకులు పడ్డాయి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్ణయం తర్వాత ఇక్కడ భూములు, అపార్ట్ మెంట్ల విలువు కనిష్టంగా 30శాతం పెరిగింది. ఉత్తరాంధ్ర భవిష్యత్తు బంగారం అవుతుందనే అంచనాల మధ్య భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రియల్ ఎస్టేట్ సంస్ధలు ముందుకు వచ్చాయి..అయితే రాజధాని రాజకీయం అటూ-ఇటూ అయితే ఇక్కడ పరిస్ధితి ఏంటి..కేపిటల్ హైప్ తారుమారైతే ఆ ప్రభావం స్టీల్ సిటీ పై గట్టిగా పడుతుందా అన్నది విశాఖ వాసుల్లో టెన్షన్ పుట్టిస్తుంది.


విశాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిత్యకల్యాణం పచ్చతోరణం. విస్తరిస్తున్న సిటీ పరిధి….భూముల కొరత కారణంగా జనావాసాలు శివారు ప్రాంతాలకు వ్యాపించాయి. ఐదేళ్ల క్రితం వరకు ఒకవైపు లంకెల పాలెం…మరోవైపు…పెందుర్తి….నేషనల్ హైవేపై మధురవాడ మాత్రమే నగరంతో కలిసి వుండేవి. ఆనందపురం-అనకాపల్లి మధ్య ఆ రులైన్ల జాతీయ రహదారి పనులు ప్రారంభమైన తర్వాత స్తిరాస్ధి వ్యాపారం దృష్టి అటువైపు మళ్ళింది. ఎప్పటికైన జంటనగరాలుగా మారతాయనే అంచనాల మధ్య విజయనగరం-విశాఖ మధ్య పెట్టుబడులు పెట్టేందుకు జనం ఆసక్తిని ప్రదర్శించడం ప్రారంభించారు. ఇందుకు మరో ముఖ్య కారణం ఇంజనీరింగ్‍, మెడికల్‍ కాలేజీలు పె
ద్ద సంఖ్యలో ఇక్కడ ఉంటమే.

పరిపాలనా రాజధాని ప్రకటన తో విశాఖ స్థిరాస్తి వ్యాపారం ఓ రేంజ్ కు పెరిగిపోయింది. ప్రభుత్వం మౌలిక రంగాల అభివ్ర్రద్ధిపై దృష్టిసారించడంతో ఆ ధీమా మరింతగా పెరిగిపోయింది. పోర్ట్ సిటీ నుంచి ప్రపంచస్ధాయి నగరంగా ఎదిగే క్రమంలో అడుగడుగా సహకరించిన కనెక్టివిటీపైనే సర్కార్ ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆనందపురం-అనకాపల్లి మధ్య ఆరులైన్ల జాతీయ రహదారి నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. ఇక, విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కానుంది. ఇందు కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయ్.

ఇక అన్నింటి కంటే ముఖ్యమైనది విశాఖపట్నం మెట్రోరైల్. అనకాపల్లి నుంచి భోగాపురం వరకు మూడు కారిడార్లలో సుమారు 16వేల కోట్ల రూపాయల పెట్టుబడు లతో ఈ ప్రాజెక్ట్ రానుంది. ఇవన్నీ విశాఖ సుస్ధిరమైన అభివ్ర్రద్ధికి బాటలు వేసేవే అయినప్పటికీ రాజధానితో వచ్చే డిమాండ్ ను వీటితో పోల్చలేమంటున్నారు వ్యాపా రులు. విశాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంత పటిష్టంగా వున్నప్పటికీ గడచిన పదేళ్ళ కాలంలో అనూహ్యమైన మార్పులకు గురికాలేదు. వ్యాపారం అంతా నిదానంగా ప్రణాళికా బద్ధంగానే జరుగుతూ వచ్చింది.

ఐతే, కేపిటల్ ప్రకటన తర్వాత ఆ సీన్ మొత్తం మారిపోయింది. భారీ వెంచర్లు, వేల కోట్ల పెట్టుబడుల మాటలు వినిపించా యి. భూముల ధరలు ఊహించని స్ధాయికి వెళ్ళిపోయాయి. కేపిటల్ కు ముందు గరిష్టంగా 80లక్షలు పలికిన ఎకరం ధర 3కోట్లకు పెరిగిపోయింది. ఇంకా పెరుగుతుందనే ఆశతో రైతులు అమ్మకాలకు అయిష్టత ప్రదర్శించారు.ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‍ అటు ఇటూ అయినా….విశాఖ తరలి రావడం మరింత ఆలస్యం అయినా స్తిరాస్ధి వ్యాపారం మరింత ఒడిదుడుకులను ఎదుర్కోవడం మాత్రం తప్పదు.

రాజధాని వస్తే రాజధానిలో నిర్మాణాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందనేది అంచనా. జనాభా క్వాంటమ్ జంప్ తీసుకుంటే అందుకు తగ్గట్టుగా అపార్ట్ మెంట్లు అవసరం. ఈ లెక్కలు వేసుకుని భారీగా ప్రాజెక్ట్ లకు రూపకల్పన జరిగాయి. భారీగా పెట్టుబడులు పెట్టి భూములు కొనుగోలు చేశారు. ఈనేపథ్యంలో స్తబ్ధత ఎక్కువ కాలం కొనసాగితే ఇబ్బందికరమైన పరిస్ధితులు తప్పవంటున్నారు స్థానిక రియల్టర్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version