గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి మెట్రోస్టేషన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా వచ్చి షిఫ్ట్ కారు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. అనంతరం మరో కారుని వేగంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ముందు కూర్చున్న వారికి పెద్దగా ప్రమాదం జరలేదని తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కారును పైకి లేపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
https://twitter.com/bigtvtelugu/status/1894924531996991690