హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ప్రదేమైన ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. డివైడర్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్ పైకి కారు ఎక్కినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి సమయంలో సంభవించినట్లు తెలిసింది. అయితే, కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రమాదం అనంతరం సదరు కారు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు.