ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నగదు జమను మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై నగదును నేరుగా విద్యార్థి లేదా తల్లిదండ్రుల ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 9, 10వ తరగతి చదువుతున్న డే స్కాలర్లకు ఏడాదికి రూ.3,500, హాస్టళ్లలో ఉండే వారికి రూ.7వేలు ఇవ్వనున్నారు.మురికివాడల్లో నివసించే కార్మికుల పిల్లలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వారికి రూ.3,500, హాస్టళ్లలో ఉంటూ 3వ తరగతి నుంచి 10వ తరగతి చదివే వారికి ఏడాదికి రూ.8వేలు అందించనున్నారు.