BREAKING : బెంగళూరులో కార్వీ చైర్మన్ పార్థసారథి అరెస్ట్

-

మనీ లాండరింగ్‌ కేసులో ప్రముఖ బిజినెస్‌ మ్యాన్‌, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్ చైర్మన్, ఎండీ సి. పార్థ సారథిని ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు బెంగళూరు లో అరెస్ట్‌ చేశారు. అనంతరం హైదరాబాద్‌ నగరానికి తరలించారు. కోర్టులో హాజరు పరిచి కస్టడీ కోరనున్నట్లు అధికార వర్గాల సమాచారం అందుతోంది.

మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద పార్థ సారథి పై ఈడీ లోగడ కేసు నమోదు చేసింది. ఇన్వెస్టర్లకు సంబంధించిన షేర్ల ను వారి అనుమతి లేకుండా… వారికి చెప్పకుండా కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ తన ఖాతాల్లోకి మళ్లీంచుకుని, వాటిపై బ్యాంకుల నుంచి రుణాలు పొందడం తెలిసిందే. ఈ రుణాలను పార్థ సారధి తనకు సంబంధించిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లోకి మళ్లీంచినట్లు అప్పట్లోనే వెల్లడైంది. ఈడీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తుంది. కార్వీ తీసుకున్న రుణాల విలువ రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని ఈడీ అంచనా వేస్తుంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news