బ్రేకింగ్ : దాస‌రి కుమారిడిపై అట్రాసిటీ కేసు.. !

మ‌రోసారి దాస‌రి కుమారుడి వ్య‌వ‌హారం వార్త‌ల్లో నిలిచింది. దాస‌రి నారాయ‌ణ రావు మ‌ర‌ణానంత‌రం ఇద్ద‌రు కుమారుల మ‌ధ్య ఆస్తివిష‌యంలో గొడ‌వ‌లు జ‌ర‌గ‌టంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో దుమారం రేగింది. ఇక ఇటీవ‌ల ఓ వ్యాపారి తాను దాసరి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న స‌మ‌యంలో ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వ‌మంటే ఆయ‌న కుమారులు చంపుతామ‌ని బెదిరిస్తున్నార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

dasarai arun rao
dasarai arun rao

కాగా తాజాగా దాస‌రి కుమారుడు అరుణ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదైంది. దాసరి నారాయణరావు వద్ద పనిచేసిన నర్సింహులుకు రావాల్సిన డబ్బుల విషయంలో వివాదం కొన‌సాగుతోంది. కాగా డబ్బులు ఇస్తానని పిలిచి కులంపేరుతో దూషించారని న‌ర్సింహులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ నెల16 న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయ‌గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.