బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు పవన్ పై ఫైర్ అయ్యారు. అంతే కాకుండా సినిమా ఇండస్ట్రీ నుండి పోసాని కృష్ణ మురళి కూడా పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తాను జగన్ అభిమాని అని పోసాని ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై విమర్శలు కురిపించారు. అంతేకాకుండా ఓ పంజాబీ అమ్మాయిని మోసం చేశారంటూ మండిపడ్డారు.

పంజాబీ అమ్మాయికి కడుపు చేశారని డబ్బులు ఇచ్చి అబార్షన్ చేయించుకోమని అన్నారని ఆరోపణలు చేశారు. అయితే పోసాని విమర్శలను పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా జనసేన తెలంగాణ ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణ మురలి పై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే పోసాని కూడా తనకు ఏమైనా జరిగితే పవన్ కళ్యాణ్ ఏ కారణం అని రేపు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తా అని చెప్పారు.