పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోసాని పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ను తిడితే ఓ అభిమానిగా తాను రియాక్ట్ అవుతానని పోసాని వ్యాఖ్యానించారు. నిన్నటి నుండి తనకు వేళల్లో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోసాని అన్నారు.

అంతే కాకుండా పంజాబీ అమ్మాయిని నువ్వు మోసం చేయలేదా..ఆ అమ్మాయికి కడుపు చేయలేదా అంటూ పోసాని పవన్ పై సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపించలేదా అంటూ పోసాని ప్రశ్నించారు. నిన్ను విమర్శిస్తే మా ఇళ్లపై రాళ్ళు వేస్తారా అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు కామన్ అని ఎన్టీఆర్ లాంటి గొప్ప వాళ్ళే విమర్శలు ఎదుర్కొన్నారు అని అన్నారు. ఇక పోసాని ప్రెస్ క్లబ్ లో వుండగానే బయట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పవన్ అభిమానులు అక్కడకు చేరుకున్నారు. దాంతో పోసాని ని పోలీసులు కార్ ఎక్కించి పంపించారు.