తెలంగాణ తెచ్చిన నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కించపర్చే విధంగా స్కిట్ వేసిన బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు.తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణనిరాహార దీక్ష చేసి అప్పటి కేంద్రాన్ని మొడలొచ్చిన పోరాట యోధుడు, ఇప్పటి తెలంగాణ అభివృద్ధి ప్రధాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై అనుచిత, అసభ్యకరమై, అభ్యంతరకరమైన స్కిట్స్ వేయడానికి మేం తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.. అలా ముఖ్యమంత్రిని కించపర్చే విధంగా నాటకాలు వేసిన, వారిని ఉసిగొల్పిన బీజేపీ నాయకులు బండి సంజయ్, ప్రేమేందర్ రెడ్డి, జిట్టా బాలకిషన్ రెడ్డి, రాణిరుద్రమపై హైదరాబాద్ వనస్థిపురం ఏసీపీ పురుషోత్తమ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీష్ రెడ్డి. ఇలా ఒక ముఖ్యమంత్రిని కించపర్చిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా వై. సతీష్ రెడ్డి మాట్లాడుతూ…. కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాదు… ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు… అలాంటి నాయకుడి మీద అభ్యంతరకర స్కిట్స్ తో ఆయన ప్రతిష్టను దిగజార్చారు…. ఈ స్కిట్ వేయించిన వాళ్లు కనీసం ఆయన కాలి గోటికి కూడా సరిపోరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి… ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్న బీజేపీ నాయకులు… మీరు ముఖ్యమంత్రి గారిని అన్నట్టు… మేం ప్రధాన మంత్రిని అనడం పెద్ద పని కాదు… ఆయన కూడా ఆయన భార్యను వదిలేశాడు.. ఎందుకు వదిలేశాడు అని అడగలేమా ? కానీ…ఆ స్థాయికి మేం దిగజారదల్చుకోలే… ఇకపై మీరు మీ చిల్లర నాటకాలు, చిల్లర ఆరోపణలు చేస్తూ… ముఖ్యమంత్రి కుర్చీకి కూడా విలువ ఇవ్వకుండా రెచ్చిపోతే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు… చీరి చింతకు కడ్తరన్న విషయాన్ని మర్చిపోవద్దు…
అంతేకాదు తెలంగాణ ప్రభుత్వ పథకాలను కూడా కించపర్చే విధంగా ఆ స్కిట్ ఉన్నది… దాన్ని కూడా మేం ఖండిస్తున్నాం… రైతు బంధు, దళిత బంధు లాంటి స్కీములు, దేశమే వాటిని అనుసరిస్తున్న స్కీములను డీఫేమ్ చేస్తూ స్కిట్ వేశారు… దళితబంధు చాలా మంచి పథకమని మీ బీజేపీ ఎమ్మెల్యేలే చెప్పిర్రు అది మర్చిపోయారా ? రాజాసింగ్ దళితబంధు మీద ఏమన్నాడో మర్చిపోయిర్రా… మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ దళితబంధు స్కీము కింద ట్రాక్టర్లు పంచుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది గుర్తుకు లేదా ? ఇక ఫించన్ల కోసం మహిళలు భర్తలను చంపుకుంటుర్రని స్కిట్ వేశారు… దానికి కింద ఉన్న బండి సంజయ్, ప్రేమేందర్ రెడ్డి లాంటి వారు పండ్లు ఇకిలిచ్చి నవ్వుతుర్రు… అరే మీరెట్ల రాజకీయ నాయకులు అయ్యర్రురా… మరీ ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా ? బీజేపీ నాయకులకు చివరిసారిగా హెచ్చరిస్తున్నాం… ఇకనుంచైనా ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానకపోతే… మేం స్టార్ట్ చేస్తం… అప్పుడు గుజరాతీ బ్యాచ్ తట్టుకోలేదు…. అని మండిపడ్డారు వై సతీష్ రెడ్డి. తెలంగాణ తెచ్చిన నాయకుడిని కించపర్చే విధంగా ఎవడు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.