మాజీ ప్రియుడేనని అర్ధనగ్న ఫోటోలు పంపింది.. తీరా వెళ్లి చూస్తే మహిళ షాక్..!!

-

ఓ ప్రేమ జంట గతంలో ప్రేమించుకుని, మనస్పర్థలు రావడంతో విడిపోయారు. కొంత కాలం తర్వాత మళ్లీ ప్రేమికుడి నుంచి ఆ మహిళకు మెసేజ్ వచ్చింది. దీంతో ప్రియుడు మారిపోయి.. తనని కావాలని అనుకుంటున్నాడని.. ఆ మహిళ తిరిగి తనతో చాటింగ్ చేసింది. అలా మళ్లీ వాళ్ల మధ్యలో ఉన్న ప్రేమ చిగురించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి మహిళకు తన న్యూడ్ ఫోటోలు పంపమని కోరాడు.

మహిళ

దీంతో ఆ మహిళ కూడా పాత పరిచయం ఉంటడంతో ఫోటోలు పంపింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఒకసారి కలుద్దామని రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఆమె ఓకే చెప్పి.. కలవడానికి వెళ్లింది. తీరా అక్కడికి చేరుకున్న ఆ మహిళ అతడిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అతను తన మాజీ ప్రియుడు కాదని తెలుసుకుని ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దీంతో ఆ కేటుగాడు ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.

పూర్తి వివరాలలోకి వెళ్తే.. హైదరాబాద్ శివారులోని శివరాంపల్లికి చెందిన మహమ్మద్ మొహ్సిన్(22) పెయింటర్‌గా పని చేస్తుంటాడు. ఓ మహిళకు రాజుగా పరిచయమై.. మెసేజ్ చేయడం ప్రారంభించారు. ఆమె కూడా తన మాజీ లవర్ అనుకుని దగ్గరైంది. ఇద్దరు ప్రేమికులలా హద్దులు మీరి మాట్లాడుకున్నారు. ఆ మేరకు యువకుడు ఫోటోలు పంపమని అడగగా.. యువతి తన అర్ధనగ్న ఫోటోలు పంపింది.

ఆ తర్వాత కలుద్దామని అడగగా.. ఇద్దరు కలిశారు. మహిళ ఆ యువకుడిని చూసి.. తన మాజీ లవర్ కాదని తెలుసుకుంది. దీంతో తన ఫోటోలు డిలీట్ చేయాలని కోరింది. ఆ యువకుడు డబ్బులు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఆ మహిళ షీ-టీమ్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడిని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version