బిజెపి ఎంపీ తేజశ్రీ సూర్య మీద సోషల్ మీడియాలో ద్వేషపూరిత పోస్ట్ చేశారని ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం తెలిపారు బిజెపి యువమోర్చా అధ్యక్షుడు బెంగళూరు సౌత్ ఎంపీ తేజశ్రీ సూర్య సామాజికమధ్యమంలో విద్వేషపూరిత పోస్టులు చేస్తున్నారని, లక్ష్యంగా చేసుకొని శత్రుత్వాన్ని పెంచేలా వ్యవహరిస్తున్నారని బృహత్ బెంగళూరు మహానగర్ పాలికే అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం చెప్పింది.
ఈనెల 19న ఎక్స్ తో పాటు యూట్యూబ్ లలో ఇటువంటి పోస్టులు చేసినట్టు తెలుస్తోంది ఆయా సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న నేపథ్యంలో ఓటర్ లని ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు ఉండడం అలానే వర్గాల మధ్య మతసామరస్యాన్ని భంగం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో మార్చి 20న ఎంపీ తేజస్వి సూర్య పై పోలీసులు కేసు నమోదు చేశారు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం మత విశ్వాసాలని అవమానించడం ఉద్దేశపూర్వకంగా హానిచేసే చర్యలకు పాల్పడిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.