నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ పై కేసు నమోదు అయింది. అక్రమంగా ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ సిబ్బంది బాణసంచా దాచారంటూ ఫిర్యాదు అందింది.. ఈ తరుణంలోనే కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. అటు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ పై కేసు నమోదు అయింది.

కాగా నిన్న హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐదో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. కిటికీల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. మరోవైపు ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో సిబ్బందితో పాటు రోగులు, వారి కోసం వచ్చిన సహాయకులు భయాందోళనకు గురయ్యారు.