పూజ చేసిన వెంటనే ఈ పనులను చేస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే..!

-

చాలా శాతం మంది భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఎన్నో పూజలను చేస్తూ ఉంటారు. అయితే పూజలను చేసినప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన ఎన్నో మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా సానుకూల శక్తి ఎక్కువగా ఉండటం వలన ఎంతో ప్రశాంతంగా కూడా జీవిస్తారు. కాకపోతే చాలా శాతం మంది పూజ చేసే సమయంలో మరియు పూజను పూర్తి చేసిన తర్వాత కూడా కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు. అటువంటి తప్పలను చేయడం వలన సరైన ఫలితాలను పొందలేరు. కనుక ఇటువంటి పొరపాట్లను చేయకుండా జాగ్రత్త పడండి. పూజ చేసిన వెంటనే కాళ్ళను కడుక్కోవడం వలన మంచి ఫలితాన్ని పొందరు. ఎందుకంటే, కాళ్లు కడుక్కోవడం భగవంతుడిని అవమానించినట్లు అని పండితులు చెబుతున్నారు.

ఎప్పుడైతే పూజ పూర్తయిన తర్వాత కాళ్లను కడుక్కుంటారో మంచి ఫలితాలను పొందలేరు. కనుక కొద్దిసేపటి తర్వాత కాళ్ళను కడుక్కోవచ్చు. పూజను పూర్తి చేసిన వెంటనే గోళ్ల ను కత్తిరించడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి చాలా ఎక్కువ అవుతుంది. దీంతో ఎలాంటి సానుకూల శక్తి ఉండదు. కనుక పూజ చేసిన తర్వాత గోళ్ల ను కత్తిరించుకోవడం వంటివి అస్సలు చేయకండి. సహజంగా ఇంట్లో పూజలు చేసినప్పుడు మాంసం, మద్యం వంటివి వాటికి దూరంగా ఉంటారు. కాకపోతే కొంతమంది వీటిని పూజ చేసిన తర్వాత తీసుకుంటారు. ఇలా చేయడం వలన భగవంతుని అనుగ్రహం పొందలేరు.

పైగా ఇలా చేస్తే ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఇలాంటి పొరపాట్లను అస్సలు చేయకూడదు. కొంతమంది పూజ చేసిన వెంటనే ప్రసాదాన్ని తింటూ ఉంటారు. అయితే ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉండటం వలన పూజ చేసిన కొద్దిసేపటి వరకు ప్రసాదాన్ని అక్కడే ఉంచాలి. ఇలా చేస్తే భగవంతుని అనుగ్రహం కచ్చితంగా పొందవచ్చు.
ఎప్పుడైతే ఇంట్లో పూజలను చేస్తారో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎటువంటి గొడవలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా వ్యవహరించాలి. ఇలా చేయడం వలన భగవంతుని అనుగ్రహాన్ని ఎంతో సులుగా పొందవచ్చు. కనుక పూజ చేసిన వెంటనే ఈ పొరపాట్లను అస్సలు చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news