ఫోన్ ట్యాపింగ్ తో కాంగ్రెస్, బీజేపీ నేతల నగదు సీజ్: తిరుపతన్న

-

తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూపి లాగుతున్నారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి.

300 మంది విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అప్పటి ASP తిరుపతన్న వాంగ్మూలంలో చెప్పారు. ‘ట్యాపింగ్ సమాచారంతో కాంగ్రెస్, బీజేపీ నేతల నగదు సీజ్ చేశాం అని అన్నారు. గాలి అనిల్ కుమార్-రూ.90లక్షలు, వినయ్ రెడ్డి-రూ.1.99 కోట్లు, రాఘవ ఇన్ఫ్రా-రూ.10.50 కోట్లు, రాజగోపాల్ అనుచరులు-రూ.3.50కోట్లు, గడ్డం వినోద్-రూ.50.45లక్షలు, ఉత్తమ్ సహచరుడు గిరిధర్-రూ.35లక్షలు, ఝాన్సీరెడ్డి నుంచి రూ.90లక్షలు సీజ్ చేశాం’ అని తెలిపారు.కాగా, విచారణ సందర్భంగా మాజీ DCP రాధాకిషన్ రావు కాంగ్రెస్, BJPకి ధన సహాయం చేసేవారిపై ఎక్కువగా నిఘా పెట్టారని వాంగ్మూలంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news