పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదని.. పాక్ అంటే ఆ పార్టీ భయపడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒడిశాలోని జాజ్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్‌లో అణుబాంబు ఉందని చెబుతోంది. పీఓకే గురించి మాట్లాడొద్దని అంటోంది అని అన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, రాహుల్ బాబా పీఓకే విషయంలో భయపడుతున్నారు అని ఎద్దేవ చేశారు.
పీఓకే భారత్‌కి చెందింది దాన్ని మేం వెనక్కి తీసుకుంటాం” అని అమిత్ షా స్పష్టం చేశారు. లక్షలాది మంది ఒడిశా యువకులు పని వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ,డబల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటయ్యాక యువత వేరే చోట ఉద్యోగాల కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. జూన్ 4 తర్వాత ఒడిశా నవీన్ మాజీ సీఎం అవుతారని అన్నారు .రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాల్లో 17 స్థానాలను కాషాయ పార్టీ గెలుచుకోవడం ఖాయమని ఆశా భావం వ్యక్తం చేశారు