అర బుర్ర డ్రామారావుకు… ఉన్నమతి పోయినట్టుంది : టీ కాంగ్రెస్

-

అర బుర్ర డ్రామారావుకు…గుంటూరులో చదివి ఉన్నమతి పోయినట్టుంది.రాజులు కట్టినా, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కట్టినా… చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవడం, వాటిని గుర్తు చేసుకోవడం, చరిత్రలో ఒక భాగంగా చెప్పుకోవడం అనివార్యం. కానీ, జాతి చిహ్నం అంటే అది ఆ జాతి చరిత్ర మొత్తానికి ప్రతిరూపం. ఆ జాతి ఘనతకు ప్రతిబింబం అని వెల్లడించింది.

తెలంగాణ చరిత్ర అంటే రాచరికంపై, అణచివేతపై, పెత్తందారీతనం పై ప్రదర్శించిన ధిక్కారం, పోరాటం, తిరుగుబాటు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో త్యాగాలు ఉండాలి తప్ప… రాజ్య భోగాలు కాదు. అణచివేతపై ప్రజల తిరుగుబాటు కనిపించాలి తప్ప… నిజాం నిరంకుశ ఆనవాళ్లు కాదు.రాష్ట్రమంటే రాజ్యమని… అయ్య తర్వాత కొడుకుగా తనకే అధికారం దక్కాలని… భ్రమించే డ్రామారావుకు ఇది ఎప్పటికీ అర్థం కాదు. ఐనా, డ్రామారావుకు ఒక్క ప్రశ్న తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ప్రజల పోరాటం ప్రస్ఫుటించాలా…? కాకతీయ రాజుల తోరణం కనిపించాలా…? రాష్ట్ర చిహ్నంలో…అమరుల త్యాగాలు ప్రతిబింబించాలా…?నిరంకుశ నిజాం నిర్మించిన కట్టడాలు ఉండాలా…? ఈ రెండింటిలో రేపటి తరానికి ఏవి ఆదర్శం…?డ్రామారావు చెప్పాలి అని ఎక్స్(ట్విట్టర్) లో ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news