రెండు స్క్రీన్లతో స్మార్ట్‌ఫోన్‌.. ఈ గ్యాడ్జెట్‌తో ప‌ని మ‌రింత సులువు..

-

సాధార‌ణంగా మ‌నం కంప్యూట‌ర్ల‌కు అప్పుడ‌ప్పుడు సెకండ్ స్క్రీన్‌ను పెట్టుకుంటాం. వీడియో ఎడిటింగ్ చేసేవారు, గేమ్స్ ఆడేవారు ఇలా కంప్యూట‌ర్ల‌కు రెండో మానిట‌ర్‌ను త‌గిలిస్తుంటారు. దీంతో ప‌ని చేయ‌డం చాలా తేలిక‌వుతుంది. రెండు తెర‌ల్లో భిన్న ర‌కాల సాఫ్ట్‌వేర్ల‌ను ఒకేసారి ఓపెన్ చేసి ప‌నిచేసుకోవ‌చ్చు. అయితే కంప్యూట‌ర్ల‌కు ఉన్న‌ట్లుగానే స్మార్ట్‌ఫోన్ల‌కు కూడా ఓ సెకండ్ స్క్రీన్ పెట్టుకునే చాన్స్ ఉంటే.. ఎంతో బాగుంటుంది క‌దా.. అవును చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకోస‌మే castAway అన‌బ‌డే ఓ స్మార్ట్‌ఫోన్ కేస్‌ను త‌యారు చేశారు.

castAway స్మార్ట్‌ఫోన్ కేస్‌లో ఓ వైపు ఫోన్‌ను ఉంచాలి. మ‌రో వైపు స్క్రీన్ ఉంటుంది. ఇది ఫోన్‌కు వైర్‌లైస్‌గా క‌నెక్ట్ అవుతుంది. దీంతో ఫోన్‌ను ఆ కేస్ నుంచి తీసినా స‌రే.. స‌ద‌రు స్క్రీన్ ప‌నిచేస్తుంది. అందులో మీ ఫోన్‌ను యాక్సెస్ చేసుకోవ‌చ్చు. ఇక ఫోన్‌లో మీరు గేమ్ ఆడితే అవ‌త‌లి వైపు కేస్‌లో ఉండే స్క్రీన్‌లో జాయ్ స్టిక్ వ‌చ్చేలా సెట్ చేసుకోవ‌చ్చు. దీంతో గేమ్స్‌ను సుల‌భంగా ఆడుకోవ‌చ్చు. అదే ఫోన్‌లో ఏదైనా టెక్ట్స్‌ను టైప్ చేస్తే.. అవ‌త‌లి వైపు కేస్‌లో ఉండే స్క్రీన్‌లో పెద్ద‌పాటి అక్ష‌రాలతో వ‌ర్చువ‌ల్ కీబోర్డు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. దీంతో ఫోన్‌లో అక్ష‌రాల‌ను సుల‌భంగా టైప్ చేయ‌వ‌చ్చు. ఇలా ప‌లు ర‌కాల మోడ్స్‌తో ఈ కేస్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది.

అయితే castAway కేస్‌ను అమెరికాలో మాత్ర‌మే విక్ర‌యిస్తున్నారు. దీనికి అయ్యే షిప్పింగ్ చార్జిల‌ను చెల్లిస్తే మ‌నం కూడా దీన్ని తెప్పించుకుని వాడ‌వ‌చ్చు. దీని ధ‌ర 249 డాల‌ర్లు (దాదాపుగా రూ.18,800)గా ఉంది. ఇక ఐఫోన్‌, ఆండ్రాయిడ్ ఏ ఫోన్ అయినా స‌రే.. దాని డిస్‌ప్లే సైజుకు త‌గ్గ castAway కేస్‌లు అందుబాటులో ఉన్నాయి. 5.8, 6.3, 6.9 డిస్‌ప్లే సైజుల్లో ఉండే ఫోన్ల‌కు గాను castAway కేస్‌లు ల‌భిస్తున్నాయి. వీటిని https://www.indiegogo.com/ అనే వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

castAway™ case from castAway Development Co. on Vimeo.

Read more RELATED
Recommended to you

Exit mobile version