సీఎం జగన్ పై నారా లోకేశ్ పంచ్..!

-

మొదటిరోజు అసెంబ్లీ సమావేశాలు చాలా వాడీవేడిగా జరిగినట్టు తెలుస్తుంది. చంద్రబాబుతో సహా పార్టీనేతలంతా నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. తాజా పరిణామాలపై ఇలా నిరసన తెలిపారు. అసెంబ్లీ లోపల అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నారు టీడీపీ నేతలు. సభలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.. దీనికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామన్నారు. అనంతరం నారా లోకేశ్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం జగన్ పై వ్యంగ్యం ప్రదర్శించారు. సీఎం జగన్ ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిద్రపోతూ కనిపించిన దృశ్యాలతో వీడియోను పంచుకున్నారు. గత సమావేశాల్లోనూ ఇలాగే నిద్రపోయాడని, ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నాడనే అర్థం వచ్చేలా ‘జగన్ అనే నేను అసెంబ్లీలో…’ అనే శీర్షికతో వీడియో రూపొందించారు. “ఇంట్లో పబ్జీ… అసెంబ్లీలో లాలిజో” అంటూ లోకేశ్ సెటైర్ వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version