కేంద్రంలోని మోడీ సర్కార్ కులగణన ప్రకటన చేయడం.. ముమ్మాటికీ తెలంగాణ సర్కార్ విజయమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కఅన్నారు.శనివారం ఆయన ఖమ్మంలో మాట్లాడుతూ..తెలంగాణలో కులగణన చేసి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కులగణనను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.కులగణన సర్వే ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కేడర్ కు సూచించారు.
ప్రభుత్వానికి బీసీలు ఎల్లప్పడూ అండగా ఉండాలని కోరారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కులగణన ఆధారంగా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపామన్నారు. కులగణన కోసం రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని కేంద్రం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడికి తలొగ్గి ఒప్పుకున్నదని అన్నారు.