చంటిబిడ్డకి మసాజ్ చేస్తున్న పిల్లి.. వైరల్ అయిన వీడియో..!

-

సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా సరదా సరదా విషయాలు జరుగుతూంటాయి. నిజానికి ఫన్నీ వీడియోస్ ఏమైనా వచ్చాయంటే వెంటనే వైరల్ గా మారిపోతాయి. చాలా మంది ఆ వీడియోలని చూసి మెచ్చుకుంటారు. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ఆ చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ వీడియో లో ఏముంది..?

 

ఎందుకు ఈ వీడియో అసలు ఎందుకు అంతగా వైరల్ అవుతోంది అనేది చూస్తే… ఈ వీడియో లో ఒక పిల్లి చంటిబిడ్డ కి మసాజ్ చేస్తోంది. ఆ పిల్ల ఎంతో క్యూట్ గా నల్లగా ఉంది. చంటిబిడ్డ కి ఆ పిల్లి మసాజ్ చేస్తోంది. ఆ చంటి బిడ్డ బోర్లా పడి ఉంటే పిల్లి మాత్రం బోర్లా పడి ఉన్న బిడ్డ కి మసాజ్ చేస్తోంది. అయితే ఆ పిల్లవాడు భయ పడకుండా చక్కగా మసాజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇప్పటికీ ఈ వీడియోని 290 వేల మందికి పైగా చూశారు. రెండు వేల మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు అయితే ఫిదా అయిపోయి నాకు కూడా ఇలాంటి పెళ్లి కావాలి అంటూ కామెంట్లు చేశారు. మరి అందర్నీ ఆకట్టుకుంటున్న ఈ వీడియోని మీరు కూడా ఓ సారి చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news