ఒకవైపు జగన్ పార్టీ ప్రతిష్టను కాపాడుకుంటూ ప్రజలకు మేలు చేస్తుంటే కొందరు నాయకులు మాత్రం వర్గపోరుకు సిద్దం అవుతున్నారు.. ఇలా చేయడం వల్ల పోయేది తమ పార్టీ పరువే అని అనుకోవడం లేదు.. మొన్నటికి మొన్న ఇళ్లపట్టాల విషయంలో లోకల్ లీడర్లు చేస్తున్న అవినీతి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.. అది మరవక ముందే మరో వివాదం తెరమీదకు వచ్చింది.. అదేమంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరుకు తెరలేచిందట..
శింగనమల ఎమ్మెల్యే భర్త వైసీపీ నేత, విద్యా సంస్కరణల కమిటీ సీఈఓ, ఆలూరు సాంబశివారెడ్డి పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇతను ఎల్లనూరు మండలం వెంకటాపురంలో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఆలూరు సాంబశివ రెడ్డికి నిరసనగా శిలాఫలకాన్ని వైసీపీలోని మరో వర్గం కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ఇకపోతే గ్రామ సచివాలయం ఏర్పాటు విషయంలో వెంకటాపురం వైసీపీలో విభేదాలు వచ్చాయట, దీనివల్ల ఇక్కడ ఘర్షణ చోటు చేసుకుందని అంటున్నారు.. ఏది ఏమైనా ఒకే పార్టీ వారు వర్గాలుగా విడిపోయి ఇలా చేయడం వల్ల ప్రజల్లో ఆ పార్టీకి ఉన్న పేరు దెబ్బతింటుదన్న విషయం తెలిసిందే.. అంతే కాదు ఇలాంటి ఘటనలు ఏపీలో అక్కడక్కడ తరచుగా చోటు చేసుకుంటున్నాయి.. నాయకులకు జగన్ ఎంతగా సర్దిచెప్పిన షరా మామూలే.. ఒకరకంగా ఈ వర్గపోరు జగన్‌కు తలనొప్పులు తెచ్చిపెడుతుందని కొందరు నాయకులు వాపోతున్నారట..