IPL RCB vs KKR : టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న‌ బెంగ‌ళూర్.. తుది జ‌ట్లు ఇవే

-

ఐపీఎల్ 2022 లో భాగం గా నేడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్, కోల్‌క‌త్ నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు ఢీ కొట్ట‌బోతున్నాయి. ఇప్ప‌టికే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్టు.. పంజాబ్ కింగ్స్ పై ఓట‌మి పాలైంది. కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు.. చెన్నై సూప‌ర్ కింగ్స్ పై విజ‌యం సాధించింది. కాగ ఈ రెండు జ‌ట్లు నేడు రెండో మ్యాచ్ ను ఆడ‌బోతున్నాయి. ఇప్ప‌టికే తొలి మ్యాచ్ లో ఓట‌మి పాలైన బెంగ‌ళూర్ ఈ మ్యాచ్ లో విజ‌యం సాధించాల‌ని చూస్తుంది.
అలాగే కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ తొలి మ్యాచ్ లో విజ‌యం సాధించి.. జోరు మీద ఉంది. ఈ మ్యాచ్ లో కూడా విక్ట‌రీ న‌మోదు చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తుంది. కాగ ఈ మ్యాచ్ లో తుది జట్లు ఇలా ఉన్నాయి.
 రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ తుది జ‌ట్టు :
ఫాఫ్ డు ప్లెసిస్ ( కెప్టెన్ ), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ ( వికెట్ కీప‌ర్ ), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్
కోల్‌క‌త్ నైట్ రైడ‌ర్స్ తుది జ‌ట్లు :
అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ ( కెప్టెన్ ), సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్ ( వీక‌ట్ కీప‌ర్ ), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Read more RELATED
Recommended to you

Latest news