ఐఎంజీ కేసులో సీఎం చంద్రబాబుకు షాక్ తగిలేలా కనిపిస్తోంది.2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో క్రీడాభివృద్ధి కోసం మామిడిపల్లి, శేరిలింగంపల్లిలో 850 ఎకరాల భూమిని ఐఎంజీకి సంస్థకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. రూ. వందల కోట్ల రాయితీతో పాటు హైదరాబాద్‌లోని స్టేడియాలను సైతం అప్పగించింది. అయితే, అదొక బొగస్ కంపెనీ అని దానికి కారుచౌకగా భూములు ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ 2012లో పిల్ దాఖలు చేయగా, ఇప్పటికీ కోర్టులో విచారణ కొనసాగుతోంది.
అయితే,న్యాయస్థానం ఈ కేసులో విచారణకు ఆదేశిస్తే విచారణ చేపడతామని సీబీఐ తరఫు లాయర్లు న్యాయస్థానానికి బదులిచ్చారు.ఈ కేసులో తాము ఎప్పుడూ వెనకడుకు వేయలేదని కోర్టుకు తెలిపారు. తాజాగా ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది.అయితే, దీనిపై కోర్టు ఎటువంటి తీర్పు వెల్లడిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఒకవేళ సీబీఐ విచారణకు కోర్టు ఓకే చెబితే చంద్రబాబు చిక్కుల్లో పడటం ఖాయంగా తెలుస్తోంది.