BREAKING : ఎమ్మెల్సీ కవిత లేఖకు బదులిచ్చిన సీబీఐ

-

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసుల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ… కవితను విచారించేందుకు ఇటీవల నోటీసులు పంపింది సీబీఐ. ఈ నెల 6న విచారణ జరుపుతామని పేర్కొంది. కవితకు అనుకూలమైన చోట విచారిస్తామని కూడా సూచించింది సీబీఐ. అయితే కవిత స్పందిస్తూ, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని, తాను డిసెంబరు 6న విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేస్తూ సీబీఐకి లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత.

తాను 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానంటూ కొన్ని తేదీలను పేర్కొన్నారు కవిత. ఈ నేపథ్యంలో, సీబీఐ నేడు కవితకు బదులిచ్చింది. ఈ నెల 11న విచారణకు అందుబాటులో ఉండాలని పేర్కొంది సీబీఐ. హైదరాబాదులోని కవిత నివాసంలోనే విచారణ జరుపుతామని, ఉదయం 11 గంటలకు విచారణ ఉంటుందని వెల్లడించింది సీబీఐ. ఈ మేరకు ఓ ఈ-మెయిల్ ద్వారా కవితకు సమాచారం అందించింది సీబీఐ.

Read more RELATED
Recommended to you

Exit mobile version