అవినాష్‌ రెడ్డి బెయిల్‌పై సీబీఐ కీలక వాదనలు 

-

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ సుదీర్ఘంగా జరుగుతోంది. ఇరు వైపుల వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. 2020 జులై 9న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను సీబీఐ విచారించిందని అవినాష్ రెడ్డి లాయర్‌ కోర్టుకు తెలిపారు. రంగన్న స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి సంవత్సరం పాటు వదిలేశారని, స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా నలుగురి వివరాలు చెప్పాడని అవినాష్ లాయర్‌ అన్నారు. కానీ సీబీఐ నెలరోజుల పాటు దస్తగిరిని విచారణకు పిలవలేదని, దస్తగిరిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని అవినాష్ లాయర్‌ వాదించారు.

విచారణకు అవినాశ్ రెడ్డి సహకరించడంలేదని, వివేకా హత్య వెనుక భారీ కుట్రను వెల్లడించేందుకు అవినాశ్ ముందుకు రావడంలేదని సీబీఐ తన కౌంటర్ లో ఆరోపించింది. “హత్య జరిగిన రాత్రి 12.27 గంటల నుంచి 1.10 గంటల వరకు అవినాశ్ వాట్సాప్ కాల్ మాట్లాడారు. ఈ నెల 15న నోటీసులు ఇస్తే 4 రోజుల సమయం కావాలన్నారు. ఈ నెల 19న నోటీసు ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల రాలేనన్నారు. తల్లి అనారోగ్యం పేరుతో ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ విడిచి వెళ్లారు. విచారణకు రావాలని ఫోన్ చేసి కోరినా అవినాశ్ రాలేదు. మళ్లీ ఈ నెల 22 నోలీసులు ఇస్తే తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజుల పాటు రానన్నారు.

అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఈ నెల 22న మా బృందం కర్నూలు వెళ్లింది. అవినాశ్ రెడ్డి అనుచరులను అక్కడ చూసిన తర్వాత శాంతిభద్రతల సమస్య రావొచ్చని అనిపించింది. జూన్ 30 లోగా వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వవొద్దు” అంటూ తన కౌంటర్ లో వివరించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version