రేపు కేజ్రీవాల్ ను ప్రశ్నించనున్న సిబిఐ..చరిత్రలోనే తొలిసారి

-

రేపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ప్రశ్నించనుంది సిబిఐ. ముఖ్యమంత్రి గా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆటంకం కలగకుండా ఉండేలా శెలవు రోజైన ఆదివారం నాడు కేజ్రీవాల్ ను విచారణ చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ “సిబిఐ” నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. “లిక్కర్ స్కామ్” లో సరికొత్త సాక్ష్యాధారాలను కనుగొన్న దర్యాప్తు సంస్థ… తాజాగా సిఎం కేజ్రీవాల్ ను ప్రశ్నించేందుకు అవే మూలాధారాలని సిబిఐ వర్గాల సమాచారం.

ఒక ముఖ్యమంత్రిని సిబిఐ విచారణకు రావాలని పిలవడం బహుశా ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం సిబిఐ సమన్లు పై ఇంకా స్పందించాల్సి ఉంది. గతంలో మాత్రం “లిక్కర్ స్కాం” లాంటిదేమీ లేదని వ్యాఖ్యానించిన కేజ్రీవాల్…దీనిపై స్పందించలేదు. ప్రధాని మంత్రి మోడిని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శిస్తున్నందునే, కక్షతో వేధిస్తున్నారని విమర్శిస్తున్న “ఆప్”…”అప్” కు చెందిన ఏ ఒక్క నాయకుడు ఇలాంటి ఆరోపణలకు భయపడేది లేదని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version