సీబీఎస్ఈ బోర్డు తమ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సీబీఎస్ఈ ప్లస్ టూ లో అడ్మిషన్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆర్ట్స్, సైన్స్,కామర్స్ ఏ కంబినేషన్ అయినా తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి తీసుకువచ్చింది సీబీఎస్ఈ బోర్డు. స్కూళ్లు కూడా ఈ నియమావళిని పాటించాలని సూచించింది.
ఇది ఎప్పుటి నుంచే దీనిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. అదేవిధంగా రద్దు అయినా సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి విధివిధానాలను కూడా జారీ చేసింది. అకాడమిక్ సంవత్సరంలో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల మార్కులను అంచనా వేయాలని తెలిపింది. దీనికి గరిష్ట మార్కులు 100 ప్రతి సబెక్టుకు, అందులో 20 మార్కులు స్కూలు ఇంటర్నల్‌తో అంచనా వేయనున్నారు. మిగతా 80 మార్కులు అకాడమిక్ ఇయర్ రిజల్స్›్ట ఆధారంగా అసెస్ చేయనున్నారు. అంటే హాఫ్ ఇయార్లీ, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ , ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ బేస్ చేసుకుని జూన్ 20న ఫలితాలను ప్రకటించనున్నామని సీబీఎస్ఈ బోర్డు తెలిపింది.