ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. అయితే అంతా పాపులర్ జాబ్స్ అయిన గ్రూప్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపే చూస్తుంటారు. వాటి కోసం లక్షల్లో పోటీపడుతుంటారు. కానీ కేంద్రం కూడా ఏటా లక్షల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుంటుంది. వాటిని ఫాలో అయితే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది.
తాజాగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. న్యూఢిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్) ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనికి అర్హత.. మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉండాలి.
మొత్తం 540 ఉద్యోగాలు ఉన్నాయి. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిజికల్, ప్రాక్టికల్ టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ వచ్చిన 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు కావాలంటే బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వెబ్ సైట్ అయిన http://www.bro.gov.in/ చూడవచ్చు. లేదంటే.. అక్టోబరు 12-18 నాటి
ఎంప్లాయిమెంట్ న్యూస్ చూడొచ్చు.