వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్.. ధ్రువ‌ప‌త్రాల వాలిడిటీ మ‌రోసారి పెంపు..

-

దేశ‌వ్యాప్తంగా ఉన్న వాహ‌న‌దారుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వాహ‌నాల‌కు సంబంధించిన అన్ని ప‌త్రాల‌తోపాటు వాహ‌న‌దారుల డ్రైవింగ్ లైసెన్స్, ఇత‌ర ధ్రువ‌ప‌త్రాల వాలిడిటీని మ‌రోసారి పెంచుతున్న‌ట్లు తెలిపింది. సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు ఆయా ప‌త్రాల గ‌డువును పెంచిన‌ట్లు కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ తెలియ‌జేసింది.

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఫిబ్ర‌వ‌రి 1వ తేదీతో గ‌డువు ముగిసిన ఆయా డాక్యుమెంట్ల‌కు గాను కేంద్రం గ‌తంలో ప‌లు మార్లు వాలిడిటీని పెంచింది. ఇక ఇప్పుడు ఆ గ‌డువును మ‌రోసారి పొడిగిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలో వాహ‌నాల‌కు చెందిన ఫిట్‌నెస్‌, ఇతర అన్ని ర‌కాల ప‌ర్మిట్లు, ఆర్‌సీలు, ఇత‌ర ప‌త్రాలు, వాహ‌న‌దారుల‌ డ్రైవింగ్ లైసెన్స్‌లు తదిత‌ర ప‌త్రాల‌ వాలిడిటీ సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు పెరిగింద‌ని అధికారులు తెలిపారు. ఆలోగా వారు త‌మ ప‌త్రాల‌ను రెన్యువ‌ల్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version